హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కన్హా శాంతి వనం గురించి. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగర శివారు లోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాల గురించి కన్హా ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని కూడా ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు.
అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించి ప్రత్యేకంగా కన్హా శాంతి వనం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు. తనకు ఎనలేని సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేలా చేసిందని అన్నారు ఈ సందర్బంగా. మళ్లీ మళ్లీ రావాలని అనిపించేలా ఉందని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు . ఆదాయం పైన దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా ఆరోగ్యంపై ఎక్కవగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రతి రోజూ ఏదో పని ఒత్తిడి ఉండక తప్పదన్నారు. ఇలాంటి చోటుకు వస్తే కాస్తంత విశ్రాంతితో పాటు ప్రశాంతత చేకూరుతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు.


















