హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కావాలని సంజూపై కక్ష కట్టారు. ఎంపిక చేసినా ఆడించక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పలుమార్లు ఫెయిల్ అయినా తమకు నచ్చిన ఆటగాళ్లను ఆడిస్తున్నారే తప్పా పుల్ ఫామ్ లో ఉన్న శాంసన్ ను మాత్రం ఆడించక పోవడం పట్ల తనను అభిమానించే వాళ్లు, పలువురు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్వాకం కారణంగా , వివక్ష వల్ల సంజూ శాంసన్ తన కెరీర్ ను కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా వికెట్ కీపర్ గా జితేష్ శర్మను తీసుకున్నారు. మరో వైపు శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ ను ఆడక పోయినా, గాయాల పాలైనా తిరిగి వారికి ఛాన్స్ లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. బీసీసీఐలో చోటు చేసుకున్న రాజకీయాల కారణంగా సంజూ శాంసన్ కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడింది. ప్రధానంగా వన్డే ఫార్మాట్ లో రాణించే సత్తా కలిగిన క్రికెటర్ . తను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. గత ఏడాది సత్తా చాటిన ముంబై జట్టుకు చుక్కలు చూపించాడు. తన నాయకత్వంలో వరుసగా విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. రన్స్ తో ఆకట్టుకున్నా చివరకు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఆడించక పోవడం దారుణం అంటున్నారు.



















