Rohan Thakkar : బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. తన చిరకాల ప్రియుడు రోహన్ థక్కర్ (Rohan Thakkar) తో నిశ్చితార్థం చేసుకునన్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఇన్ స్టా స్టోరీస్ వేదికగా తెలిపింది. రోహన్ థక్కర్ రచయితగా గుర్తింపు పొందారు.
Rohan Thakkar – Anshula Kapoor Engagement
అమెరికాలో న్యూయార్క్ సెంట్రల్ పార్క్ వేదికగా తాము ఒకరినొకరం ఉంగరాలు మార్చుకున్నామని తెలిపారు.ఈ సందర్బంగా ఇన్నేళ్ల పాటు కలిసి నడిచిన అడుగులు, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇది అనిర్వచనీయమైన ప్రేమ కథగా పేర్కొంది అన్షులా కపూర్.
విషయం తెలిసిన వెంటనే సినీ, క్రీడా , వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత బోనీ కపూర్ , దివంగత మోనా శౌరీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తాను మూడు సంవత్సరాల కిందట డేటింగ్ యాప్ లో రోహన్ థక్కర్ ను కలుసుకున్నానని వెల్లడించింది. తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది నేషనల్ పార్క్ లోని కోట. దాని ముందు తను ప్రపోజ్ చేశాడు.
ఎందుకో తనంటే ప్రేమ కలిగింది. ఆనాటి నుంచి నేటి దాకా మేం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నా మనసుకు తను అత్యంత దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. అందుకే తనతో అయితేనే ఈ జీవితమనే ప్రయాణం హ్యాపీగా సాగుతుందని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.
Also Read : Saif Ali Khan Shocking Case : ఆస్తుల కేసులో సైఫ్ అలీ ఖాన్ కు ఎదురు దెబ్బ



















