ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సీరీస్ కు ఆడే భారత జట్టును వెల్లడించింది. ముంబై వేదికగా ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి. గాయం కారణంగా వన్డే, టెస్టులు ఆడలేక పోయిన శుభ్ మన్ గిల్, టి20 , వన్డే ఫార్మాట్ లలో గత కొంత కాలంగా ఆడలేక పోయిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు ఎట్టకేలకు ఛాన్స్ లభించింది. విచిత్రం ఏమిటంటే తనను కావాలని పక్కన పెట్టారు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్. శుభ్ మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉండగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరోగ్య పరంగా ఫిట్ కావడంతో తనను ఎంపిక చేసినట్లు వెల్లడించారు అజిత్ అగార్కర్. మరో వైపు గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా పునారగమనం చేశారు. పాండ్యా బరోడాతో జరిగిన మ్యాచ్ లో 77 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇక జట్టు పరంగా చూస్తే : సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్ ) , శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్ ) , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ), సంజూ శాంసన్ (వికెట్ కీపర్ ) , జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ , కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాసింగ్టన్ సుందర్ ఆడనున్నారు. ఇక టి20 సీరీస్ డిసెంబర్ 9న కటక్ లో ప్రారంభం అవుతుంది. 11న ముల్లన్ పూర్, 14న ధర్మశాల, 17న లక్నో, 19న అహ్మదాబాద్ లో మ్యాచ్ లు జరుగుతాయి.



















