Rohit Sharma : రాంచీ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన వన్డే మ్యాచ్ లో రికార్డ్ బ్రేక్ చేశాడు. తన వన్డే క్రికెట్ కెరీర్ లో 60వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే సమయంలో మరో రికార్డ్ సమం చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఇన్నింగ్స్ లో 15వ ఓవర్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయన్ ఔలింగ్ లో డీప్ మిడ్ వికెట్ పై వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రిదీతో సమం చేశాడు. చరిత్రలో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన పాకిస్తాన్ ఆటగాడు నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ సీరీస్ లో 349 సిక్సర్లు కొట్టాడు.
Rohit Sharma New Record in One Day Cricket
ఇదిలా ఉండగా 1996 నుండి 2015 మధ్య 398 వన్డే మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు కొట్టిన అఫ్రిది కంటే రెండు సిక్సర్లు వెనుకబడి ఉన్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో అత్యధిక వన్డే సిక్సర్లు బాది ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 38 ఏళ్ల కుడిచేతి వాటం బౌలర్ వేసిన బంతులను సిక్సర్లుగా మలిచాడు. వన్డే క్రికెట్‌లో తన 60వ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కొద్దిసేపటికే ఈ రికార్డును సాధించాడు. చివరికి రోహిత్ 50 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో తన జట్టును టైటిల్ విజయానికి నడిపించాడు. భారత మాజీ కెప్టెన్ 2007లో అరంగేట్రం చేసిన తన 278వ వన్డేలో కేవలం 270వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సాధించడం విశేషం.
Also Read : PM Modi Important Call : కాశీ తమిళ సంగమంలో పాల్గొనాలి : మోదీ



















