M Venkaiah Naidu : అమరావతి : పాడి రైతులు సాధించిన అపూర్వ విజయాన్ని చూసి తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu). కృష్ణాజిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం పట్ల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ 60 సంవత్సరాల మహోన్నత సహకార ప్రస్థానం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశంలో క్షీర విప్లవానికి, పాడి రైతుల సహకార సంఘ విజయానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాంది పలికారని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కృషికి గుర్తుగా ఇక్కడ పటేల్ విగ్రహాన్ని మిల్క్ యూనియన్ ప్రాంగణంలో పాలక మండలి ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు.
Ex Vice President M Venkaiah Naidu Key Comments on Farmers
ఈ సందర్భంగా పటేల్ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఇదే ఆవరణలో ఏర్పాటుచేసిన 650 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. 1965లో కేవలం 646 లీటర్లతో మొదలైన ఈ యూనియన్, నేడు ఏటా 11 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తూ, రూ. 1200 కోట్ల వార్షిక టర్నోవర్‌తో అద్భుతమైన ప్రగతి సాధించడం గర్వ కారణంగా ఉందన్నారు. లక్షలాది రైతు కుటుంబాలకు ఇది వెలుగులు నింపిందన్నారు. తమ సమర్థ నాయకత్వంతో ‘విజయ’ ను విజయాల బాట పట్టిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్ చలసాని ఆంజనేయులుకి , మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబుకి, ఇతర పాలక మండలి సభ్యులను అభినందించారు. శ్వేత విప్లవ స్ఫూర్తిని నిలబెడుతున్న పాడి రైతు సోదర సోదరీ మణులకు కంగ్రాట్స్ తెలిపారు. గ్రామాల ఆర్థిక స్వయం సమృద్ధి కి పాడి పరిశ్రమ దోహదకారిగా ఉంటుందన్నారు. రైతులు కేవలం పాల ఉత్పత్తిపై ఆధారపడకుండా, పెరుగు, నెయ్యి, పన్నీర్ వంటి విలువ జోడింపు ప్రక్రియలలో శిక్షణ పొంది ఆదాయం పెంచుకోవాలని సూచించారు.
Also Read : Harish Rao Strong Demand : కాళోజీ యూనివర్శిటీ బాగోతంపై చర్యలు తీసుకోవాలి


















