Allu Arvind : హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత , అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ను శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారించింది. దాదాపు మూడు గంటలకు పైగా తనపై పలు ప్రశ్నలు సంధించింది. సంచలనం సృష్టించింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ కుంభకోణం (Bank Scam). ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కాంలో అల్లు అరవింద్ కు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారించింది ఈడీ.
Allu Aravind ED Case
ఇదిలా ఉండగా విచారణ అనంతరం దర్యాప్తు సంస్థ అధికారులు ఝలక్ ఇచ్చారు నిర్మాతకు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు అల్లు అరవింద్ (Allu Aravind) ను. ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైదరాబాద్ లో ఉంది. ఈ సంస్థకు సంబంధించిన రూ. 101 కోట్ల బ్యాంకు రుణం మోసం కేసులో నిర్మాతను ప్రశ్నించింది.
కాగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017-19 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడారని ఈడీ గుర్తించింది. మొదట సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ దర్యాప్తులో భాగంగా విస్తు పోయే అంశాలు వెలుగు చూశాయి . రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా విచారణలో బ్యాంకు లావాదేవీలతో పాటు ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Also Read : Mallikarjun Kharge Clear Orders : పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం – మల్లికార్జున్ ఖర్గే



















