Nara Bhuvaneswari : చిత్తూరు జిల్లా : జీవితంలో ఎదగాలంటే విద్య ఓ అద్బుతమైన సాధనంగా ఉపయోగ పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari). కుప్పం నియోజక వర్గం పరమ సముద్రం గ్రామంలో పర్యటించారు. కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. KGBV నుంచి గురుకుల పాఠశాలకు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. అనంతరం సామగుట్టపల్లిలో విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు నారా భువనేశ్వరి. కుల, మతాలకు అతీతంగా మనకు గుర్తింపు తీసుకు వచ్చేది ఒక్కటేనని, అది చదువు మాత్రమేనని స్పష్టం చేశారు.
Nara Bhuvaneswari Interesting Comments on Success
మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది బాల్యం అని, దానిని నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు చదువు కోవాలని, మనల్ని మనం సంస్కరించు కునేందుకు ఇది ఉపకరణంగా దోహద పడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం అప్ డేట్ చేసుకోవాలని సూచించారు నారా భువనేశ్వరి. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విజయానికి షార్ట్ కట్స్ ఉండవని, పట్టుదలతో విజయం సాధించాలని పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.
Also Read : President Murmu Tirumala Visit Interesting : తిరుమల శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము


















