YS Sharmila : విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇలాగేనా బాధ్యతా రాహిత్యంతో మాట్లాడటం అంటూ మండిపడ్డారు. అరకొర జీతాలు ఇచ్చినా తట్టుకుని కార్మికులు పని చేస్తున్నారని, నిర్దేశించిన టార్గెట్ కంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారని దానిని పరిగణలోకి తీసుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నోరు పారేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంపై షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పై తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
YS Sharmila Slams CM Chandrababu for Steel Plant Privatization
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో స్టీల్ ప్లాంట్‌ను 20 మిలియన్ టన్నుల ప్లాంట్‌గా చేయడానికి ప్రణాళికలు చేశారని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా ఆ స్టీల్ ప్లాంట్‌ను చంపే కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకాలం స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టింది కార్మికులేనని, ఆ విషయం తెలుసుకోక పోవడం దారుణమన్నారు ప్రభుత్వం బాధ్యత మరిచి నిందను కార్మికుల మీద పెడతారా? ఒకప్పుడు ఈ ప్లాంట్ లో 30 వేల మంది ఉద్యోగులు ఉండే వారని, కానీ ఇప్పుడు 18 వేలకు కుదించారని ఈ పాపం మీది కాదా అని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే స్టీల్ ప్లాంట్‌ను చంపి అదానీకి ఇవ్వాలనే కుట్ర కోణం కనిపిస్తుందన్నారు. ప్రైవేటీకరణ చేసేందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు షర్మిలా రెడ్డి.
Also Read : Minister Savitha Important Update : ఏపీ ‘టెక్స్ టైల్స్’కు మంచి రోజులు
















