Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్మికర వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నారన్న దానిపై నోరు మెదపకుండా ఉన్న నటి ఉన్నట్టుండి ఇవాళ తన మనసులోని మాట బయట పెట్టింది. తాను రౌడీ ప్రేమలో పడ్డానంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు తాను డేటింగ్ చేస్తున్నానన్నది వాస్తవమేనని ప్రకటించింది. దీంతో రష్మిక మందన్నా(Rashmika) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rashmika Mandanna Confirms her Love
ఇదిలా ఉండగా ప్రస్తుతం తాను ఫుల్ బిజీగా ఉంది. తాను నటించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బాలీవుడ్ లో వంగా సందీప్ రెడ్డి రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ బాక్సులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 మూవీ ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్ సక్సెస్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది.
పుష్ప2 చిత్రం ఏకంగా రూ. 2000 కోట్లను దాటేసింది. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ ఏడాది వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీన మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఛావా చిత్రలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది. ఈ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. తాజాగా రష్మిక చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
Also Read : Karan Johar Impressive :జక్కన్న మామూలోడు కాదు జీనియస్