CM Revanth Reddy : హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఆడబిడ్డలకు తీపి కబురు చెప్పారు. సిరిసిల్ల చేనేత కార్మికుల చేత నేయించిన కోటి నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు “ఇందిరమ్మ చీరల పథకం” కింద పంపిణీ చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.చీరల ఉత్పత్తి, నాణ్యత, అర్హులైన ప్రతి మహిళకు చీరను పంపిణీ చేసే అంశం పై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు సీఎం. చీరల ఉత్పత్తి బాధ్యత సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించడం జరిగిందని చెప్పారు. భారీ ఎత్తున ఉత్పత్తికి సమయం పట్టే అవకాశం ఉన్నందున రెండు దశల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
CM Revanth Reddy New Innovation
సమీక్ష అనంతరం సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం చేనేతకు ప్రసిద్ది అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, నారాయణ, కొత్తకోట చీరలకు పెద్ద ఎత్తున ఆదరణ ఉందని చెప్పారు. అంతే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ , తదితర జిల్లాలలో కూడా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున చేనేత వృత్తి పనిపై ఆధారపడ్డారని తెలిపారు. ఇదిలా ఉండగా మొదటి విడతగా ఇందిరాగాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ఇందిరమ్మ పథకం కింద గ్రామీణ మహిళలకు ఇవాళ పంపిణీ చేశామన్నారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 నాటికి అర్హులైన ప్రతి గ్రామీణ మహిళకు ఈ పథకం కింద చీరను అంద చేస్తామన్నారు ఎ. రేవంత్ రెడ్డి.
ఇక పట్టణ ప్రాంత ఆడబిడ్డల కోసం మార్చి 1, 2026 నాడు మలి విడత పంపిణీ ప్రారంభించి… అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
Also Read : Minister Uttam Kumar Strong Demand : పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం
















