Allu Arjun : తీసింది కొన్ని సినిమాలే కానీ దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందాడు ప్రశాంత్ నీల్. శాండిల్ వుడ్ లో తను ఓ సెన్సేషన్. యశ్ తో తీసిన కేజీఎఫ్ రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ సైతం దుమ్ము రేపింది. ప్రభాస్ తో సలార్ తీశాడు. అది బిగ్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం డ్రాగన్ పై ఫోకస్ పెట్టాడు. తన ఆలోచనలకు, రాసుకున్న స్టోరీకి సరిగ్గా సరిపోతాడని జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకున్నాడు. దానికి డ్రాగన్ అని పేరు పెట్టాడు. ఇక టేకింగ్, మేకింగ్ లో తను సో డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఎక్కువగా తల తిక్క డ్యాన్సులు అంటూ ఉండవు. కథనే డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకే తన మీద తనకు ఎక్కువ నమ్మకం. తీసే మూవీపైనే ఎక్కువగా ఫోకస్ పెడతాడు.
Allu Arjun Movie with KGF Director
తను డ్రాగన్ తర్వాత టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో , ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ విషయాన్ని కన్ ఫర్మ్ కూడా చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తను నిర్మించిన తమ్ముడు మూవీ ఈవెంట్ సందర్బంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం బన్నీతోనే ఉండ బోతోందని తెలిపాడు. మరో వైపు బన్నీ ఫుల్ బిజీగా మారి పోయాడు. తను స్టార్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ తీస్తున్న మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
దీనిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఏకంగా రూ. 850 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. భారత దేశ సినీ చరిత్రలో భారీ మొత్తంలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీకి ఏకంగా రూ. 350 కోట్లు పారితోషకం కింద ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక జరిగితే ఈ ఇద్దరూ రెమ్యునరేషన్ విషయంలో మరో రికార్డ్ సాధించినట్టే. ఇక దమ్మున్నోడు బన్నీ, గట్స్ ఉన్నోడు ప్రశాంత్ నీల్ కలిస్తే సినిమా చేస్తే అది ఏ మేరకు బాక్సులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.
Also Read : Beauty Samantha – Sekhar Kammula : సమంతపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఫోకస్



















