IBomma Ravi : హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పైరసీ సైట్స్ ఐ బొమ్మ, బొప్పం ఫౌండర్ ఇమ్మడి రవి (IBomma Ravi) కీలక విషయాలు బయట పెట్టాడు. తాను ఇలా చేసేందుకు చాలా కారణాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తెలిపాడు. నా భార్య, నా అత్త వల్లే ఈరోజు నేను ఇలా అవ్వడానికి కారణం అని వాపోయాడు. ఐ బొమ్మ రవి (IBomma Ravi ) భావోద్వేగంతో కూడిన సంచలన విషయాలు వెల్లడించడం ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది. ఇది పోలీసులను, ఇతరులను సైతం విస్తు పోయేలా చేస్తోంది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మామూలు డిగ్రీ పట్టా పొందాను. జీవితంలో చాలా ఒడిదుడుకులు చూసా. వెబ్ డిజైనర్ గా నా కెరీర్ మొదలు పెట్టానని చెప్పాడు. తల్లి తండ్రులు విడిపోయారు. మా నాన్న ఒక చిన్న బ్యాంకు ఉద్యోగి. గత ఏడాదే నా చెల్లి పెళ్లి చేశానని చెప్పాడు.
IBomma Ravi Shocking Comments
ప్రేమించి పెళ్లి చేసుకున్నా. దీంతో నాలో భయంతో పాటు బాధ్యత కూడా పెరిగిందన్నాడు ఐబొమ్మ రవి (IBomma Ravi ). నా ప్రేమ పెళ్లికి సహకరించిన వాళ్లే నన్ను ఎందుకూ పనికి రావంటూ అందరి ముందు అవహేళన చేశారంటూ వాపోయాడు. నాకంటే ఇతరుల మాటలను నా భార్య, అత్త ఎక్కువగా నమ్మారని తెలిపాడు. చివరకు భార్య, అత్త టార్చర్ ఎక్కువై పోయింది. వారి మాటలను సహించ లేక పోయానని అన్నాడు. వెబ్ డిజైనర్ గా మొదట్లో నాకు జీతం చాలా తక్కువ వచ్చేది అది నాకు నా కుటుంబానికి సరిపోయేది కాదు. కానీ నా భార్య అత్తకి అవసరానికి డబ్బులు ఇవ్వలేక పోయానని తెలిపాడు.
వాళ్ల బాధ ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైన్ అనుభవంతో నేను ఐ బొమ్మ వెబ్ సైట్ ను ప్రారంభించాను. ఐ బొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాడిని. 2021 రెండో కోవిడ్ సమయంలో లో నా ఐ బొమ్మ వెబ్సైట్ కు విపరీతమైన ఆదరణ వచ్చిందని చెప్పాడు. ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బు అక్షరాల 75 లక్షలు అని వెల్లడించాడు .ఆరోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఇంటికి వెళ్లి నా భార్య అత్తకు నేను సాధించిన ఘనత ఆధారాలతో చూపిస్తే కూడా నన్ను నమ్మ లేదన్నాడు. నా భార్య వారి అమ్మ మనసులో నన్ను వదిలించు కోవాలని అనుకున్నారని అర్థమైందన్నాడు.
నేను ఈ దారిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం నా భార్య, అత్తే. ఎన్నో సార్లు నన్ను ఏడిపించారు. సమాజంలో నా మీద చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఆరోజే తెలిసింది సమాజంలో డబ్బు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమోనని. ఇవాళ నేను దొరికి పోవడానికి కారణం కూడా వాళ్లేనని తనకు తెలుసు అన్నట్టు సమాచారం.
Also Read : K Kavitha Fired on CM Revanth : బీసీల రిజర్వేషన్లపై మాట మార్చిన సీఎం
















