Kannappa : టాలీవుడ్ కు చెందిన డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా అందనంత స్టార్ డమ్ ను స్వంతం చేసుకున్న తను గొప్ప మనసున్నోడు. కల్మషం , ద్వేషం అన్నది లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమగా డార్లింగ్ అంటూ పిలవడం అలవాటు చేసుకున్నాడు.
Hero Prabhas Not Taken Remuneration Kannappa
దీంతో ఇండస్ట్రీ అతడిని డార్లింగ్ అంటూ పిలవడం మొదలు పెట్టింది. తను ఇప్పుడు ఇండియన్ డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి తీయబోయే స్పిరిట్ పై ఫోకస్ పెట్టాడు. మరో వైపు తను నటించిన కల్కి మూవీ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ తరుణంలో హాట్ టాపిక్ గా మారాడు ప్రభాస్. ఇటీవలే మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న కన్నప్ప(Kannappa)లో తను స్పెషల్ రోల్ లో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి రామ జోగయ్య శాస్త్రి రాసిని శివ శివ శంకర అనే పాటను బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఫౌండర్ శ్రీశ్రీశ్రీ రవి శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ నటించేందుకు ఎంత తీసుకుని ఉంటాడని. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు తను విష్ణు తండ్రి మోహన్ బాబుతో ఉన్న పరిచయం కారణంగా ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఎంత మంచి మనసు కదూ మా డార్లింగ్ ది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
Also Read : Rajinikanth Warning :దళపతిపై కామెంట్స్ తలైవా సీరియస్