Priyanka Chopra : హైదరాబాద్ : గ్లోబల్ బ్యూటీగా పేరు పొందిన ప్రియాంక చోప్రా జోనాస్ (Priyanka Chopra) కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంలో తనకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గ్లోబ్ ట్రాట్టర్ మూవీ గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈసందర్భంగా రాజమౌళి, మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా మాట్లాడారు. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టులో తాను భాగం పంచు కోవడం మరిచి పోలేనని పేర్కొన్నారు. జక్కన్నతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర సినీ అభిమానుల కంటే తెలుగు వారు మాత్రం వెరీ డిఫరెంట్ అంటూ పేర్కొన్నారు. ప్రధానంగా మహేష్ బాబు , జక్కన్నతో కలిసి పని చేయడం వల్ల తాను కొత్త విషయాలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడిందన్నారు ప్రియాంక చోప్రా.
Actress Priyanka Chopra on Varanasi Movie
అంతే కాకుండా వారణాసి సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీశారంటూ , మ్యూజిక్ కూడా సూపర్ గా వచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు దర్శకుడు రాజమౌళి, ఎంఎం కీరవాణి లపై. ఈ చిత్రంలో భయంకరమైన పాత్ర పోషించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రియాంక ప్రత్యేక ప్రశంసలు ఇచ్చారు. సినిమాలో మీరు నిజంగా భయానకంగా ఉంటారని, కానీ నిజ జీవితంలో మీరు చాలా ముద్దుగా ఉంటారంటూ ప్రత్యేకంగా ప్రస్తావించింది. సినిమాలో మందాకిని పాత్ర కోసం తనను ప్రత్యేకంగా ఎంచుకున్నందుకు దర్శక ధీరుడు జక్కన్నకు ఈ సందర్బంగా థ్యాంక్స్ తెలిపారు. మహేష్ బాబు అద్భుతమైన నటుడు. తను సింహం కంటే ఎక్కువ. తనను మీ కుటుంబంలో ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : DY CM Pawan Kalyan Important Update : ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం

















