Gottipati Ravi Kumar : విశాఖపట్నం : టెక్నాలజీ కోసం మాత్రమే కాకుండా ఇంధన వ్యవస్థల రక్షణ కోసం CECRC ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar). విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ రంగానికి సంబంధించి పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి రవికుమార్ ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యుత్ పరంగా ఎలాంటి కొరత లేదన్నారు. దీనికంతటికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరించడం వల్లనే సాధ్యమైందని చెప్పారు. టెక్నాలజీ కోసం మాత్రమే కాకుండా ఇంధన వ్యవస్థల రక్షణ కోసం సీఈసీఆర్సీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
Minister Gottipati Ravi Kumar Key Comments
ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు గొట్టిపాటి రవికుమార్. ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ జేరేమీ జర్గన్స్ మాట్లాడుతూ ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పారు. ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయమని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమైన అంశమని వివరించారు. సామాజికంగా, ఆర్ధికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరమవుతాయని జేరేమీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
Also Read : Minister Nara Lokesh Important Update : డేటా సెంటర్లకు తక్కువ ఖర్చుతో విద్యుత్


















