Hydraa : హైదరాబాద్ : చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా (Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. ఇందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. సమస్య తెలుసు కోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని అన్నారు. మూసీకి వరదల నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంట జలశయాలను నిర్మించి చరిత్రలో మోక్షగుండం నిలిచి పోయారన్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజనీర్స్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ముఖ్య అతిగా హాజరై అవార్డులను అందజేశారు.
Hydraa Commission Comments
అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ డ్రైనేజీ, ట్రాఫిక్, వాతావరణ మార్పులపై ఇంజీనర్లు ఖచ్చితమైన పరిష్కార మార్గాలను చూపే విధంగా కృషి చేయాలన్నారు. 2025లో కూడా పాత పద్ధతుల్లోనే సీవరేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలను పరిష్కరించడం సరికాదని చెప్పారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని శాశ్వత పరిష్కార మార్గాలను చూపించాలని కోరారు. హైడ్రా కమిషనర్ గా పనిచేస్తూ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఇప్పుడు చేస్తున్న పనులు రాబోయే తరాలకు ఎంతో ఉపయోగప డతాయని తెలిపారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఇంజనీర్లు అంతటితో ఆగిపోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగునంగా ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.
Also Read : Minister Kandula Durgesh Important Update : పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా















