Minister Uttam Kumar : నల్లగొండ జిల్లా : తమ ప్రభుత్వం విద్యా రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar). ఇందులో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతోందన్నారు. ఒక్కో స్కూల్ కు రూ. 200 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు రోడ్డు సౌకర్యం కోసం గరిడేపల్లి మండలం, గడ్డిపల్లిలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనిని రూ 20 కోట్లతో గడ్డిపల్లి నుండి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు 5 కిలోమీటర్ల పొడవున డబుల్ లైన్ BT రోడ్డు నిర్మాణం జరుగుతుంది.
Minister Uttam Kumar Reddy Comments
ఈ రోడ్డు నిర్మాణం తో గడిపల్లి, కుతుబ్ షాపురం , బొలిశెట్టి వారి గూడెం, చిన్నగారకుంట తండా లకు రోడ్డు సౌకర్యం కలగనుందని చెప్పారు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం కేవలం కులాల వారీగా స్కూళ్లను ఏర్పాటు చేసిందని కానీ తాము వచ్చాక వాటినన్నింటిని పక్కన పెట్టి అందరికీ ఒకే స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ను తీసుకు రావడం జరిగిందన్నారు మంత్రి. భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్పీ నరసింహా, ఆర్డీఓ శ్రీనివాసులు, ఈఈ సీతారామయ్య, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుందరి నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read : CM Revanth Reddy Important Update : డిసెంబర్ లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ : సీఎం

















