Minister Anitha : విశాఖపట్నం జిల్లా : రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ సరఫరా చేసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆధ్వర్యంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో జరగనున్న అభ్యుదయ పేరుతో అవగాహన సైకిల్ ర్యాలీని పాయకరావుపేటలో మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి వారిని ప్రోత్సహించారు అనిత వంగలపూడి. 25 రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్ల మేర జరగనున్న ర్యాలీ అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో సాగనుందని చెప్పారు.
Minister Anitha Comments
డ్రగ్స్ కు బానిసై వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు మంత్రి వంగలపూడి అనిత. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక మద్యం సరఫరా, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని చెప్పారు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ సందర్బంగా సైకిల్ ర్యాలీ చేపట్టడం పట్ల అభినందనలు ఎలిపారు మంత్రి. ఈ ర్యాలీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు, విద్యార్థులకు వివరించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పాయకరావుపేటలో విద్యార్థులు “మాదక ద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు” అంటూ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. యువత గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.
Also Read : YSRCP Fired on AP Govt : సర్కార్ నిర్వాకం వైసీపీ ఆగ్రహం















