Maganti Sunitha : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసన సభ నియోజకవర్గంలో చాలా మంది ఆకు రౌడీలంతా తిష్ట వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha). ఇవాళ పోలింగ్ కొనసాతోంది. తన బిడ్డలు, కొడుకుతో కలిసి వచ్చి తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు , ఆకు రౌడీలు ఓటు వేసేందుకు వచ్చిన మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిని భయభ్రాంతులకు గురి చేశారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం చోటు చేసుకుంది.
Maganti Sunitha Shocking Comments
అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. ఆమె బహిరంగంగా సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పై. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరిని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారని మండిపడ్డారు. తన భర్త మాగంటి గోపినాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఇంత దౌర్జన్యం ఎన్నడూ చేయలేదన్నారు మాగంటి సునీత. 13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, 14వ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెప్తానని అన్నారు . ఇంకా కొన్ని గంటల సమయం ఉందని, దయచేసి ప్రజలంతా బయటకి వచ్చి ఓట్లు వేయాలని సునీత కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి రేపు నీ సంగతి చెప్తామని నన్నే బెదిరించారని వాపోయారు.
Also Read : Great Poet Ande Sri Death : కవి అందెశ్రీ పాడె మోసిన రేవంత్ రెడ్డి
















