Ande Sri : హైదరాబాద్ : ప్రభుత్వ లాంఛనాలు, అశ్రు నయనాల మధ్య, వేలాది మంది కవులు, గాయకులు, రచయితలు, అభిమానుల మధ్య ప్రముఖ కవి, రచయిత , గాయకుడు అందెశ్రీ (Ande Sri) కాల గర్భంలో కలిసి పోయారు. ఆయన పాడెను మోశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు రేవంత్ రెడ్డి. బరువెక్కిన గుండెతో పాడి మోసి ఆయనతో నాకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నానని అన్నారు.
Poet Ande Sri Death
తన గళంతో, కలంతో జాతిని జాగృత పరిచి, తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన అందెశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు సీఎం. తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారని చెప్పారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో ఆయన ప్రతిధ్వనిస్తారని పేర్కొన్నారు. ఎక్కడా, ఎలాంటి చదువు చదవక పోయినప్పటికీ తను మహోన్నత కవిగా పేరు పొందేలా తనను తాను మల్చుకున్న తీరు గొప్పదన్నారు. ఇవాళ అందెశ్రీ మన మధ్య లేక పోవచ్చు కానీ ఎల్లప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత కాలం నిలిచే ఉంటారని, మన గుండెల్లో కొలువై ఉంటారని చెప్పారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Sanju Samson Birthday Sensational : హ్యాపీ బర్త్ డే సంజూ శాంసన్















