KTR : హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్‌గూడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. యూసుఫ్ గూడలోని అమరావతి పబ్లిక్ స్కూల్ లో తాను చదువుకున్నట్లు తెలిపారు. ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. బస్తీ దవాఖానా, 20 వేల లీటర్ల వరకు ఉచిత నీళ్లు, కరెంటు కష్టాలు లేకుండా చేశామన్నారు. వెంగళ్‌రావు నగర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించుకున్నాం. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, కొత్త లింక్ రోడ్లు వేసుకున్నామని, అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు కేటీఆర్.
KTR Slams Congress Govt
తెలంగాణ ఏర్పడక ముందు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు దానిని మరో 10 లక్షలకు పెంచడం జరగిందన్నారు. తమ హయాంలోనే తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. కొంచెం కష్టమైనా కుటుంబం బాగుండాలని పేదలు ప్లాట్లు కొన్నారని తెలిపారు. కానీ ఆ ప్లాట్ల ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ ఆలోచించాలని న్నారు. మనం పెట్టిన పెట్టుబడులు హరతి కర్పూరంలా కరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందన్నారు.
Also Read : Rashmika Mandanna Sensational Announcement : విజయ దేవరకొండను పెళ్లి చేసుకోబోతున్నా
















