CMD Lotheti : తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి (CMD Lotheti) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వినూత్నంగా డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీన సోమవారం దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఈ డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రావచ్చని తెలిపారు.
CMD Lotheti Shiva Shankar Comments
వినియోగదారుల సమస్యలను ఆయా ప్రాంతాల్లో సాంకేతిక అంశాలను పరిగణలోనికి తీసుకుని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం ద్వారా పరిష్కరించు కోవచ్చని వెల్లడించారు.
Also Read : CM Chandrababu Important Update : శంకర పీఠం సేవలు ప్రశంసనీయం : సీఎం
















