RGV : హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ శివ. తెలుగు చలన చిత్ర రూపు రేఖలను మార్చేసింది. సినిమా రంగం గురించి మాట్లాడాలంటే శివ తర్వాత శివకు ముందు అనేలా దానిని తీశాడు. ఆ తర్వాత ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో తన సత్తా ఏమిటో చూపించాడు ఆర్జీవీ (RGV). ఇదిలా ఉండగా ఈ మధ్య కొత్త ట్రెండ్ నెలకొంది టాలీవుడ్ లో. అదేమిటంటే గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీ రిలీజ్ చేస్తున్నారు. కొత్త టెక్నాలజీని జోడిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి కూడా తిరిగి రాబోతోంది. ఇదే సమయంలో తాను తెరకెక్కించిన నాగార్జున, అమలతో తీసిన శివ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.
RGV – Hero Chiranjeevi Comments
ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు రామ్ గోపాల్ వర్మకు, నాగార్జునకు అభినందనలు తెలియ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు. దీనిపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు. ఇదే సమయంలో తనకు సారీ కూడా చెప్పాడు. గతంలో తనతో మూవీ తీసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అది తెరకెక్కలేదు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఆగి పోయింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నాడు ఆర్జీవీ. ఈ సందర్బంగా చిరంజీవిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు . మిమ్మల్ని ఏ రకంగానైనా బాధ పెట్టినట్లయితే క్షమించాలని కోరాడు ఆర్జీవీ.
Also Read : BJP MLA Hans Raj Pocso Case Sensational : బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ పై పోక్సో కేసు

















