TTD : తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇందుకోసం ఆఫ్‌లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియ జేస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) ఈవో 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహారాష్‌ట్ర నుండి రమేష్ అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుని పారదర్శకంగా టోకెన్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాం అన్నారు. త్వరలో వివరాలు తెలియజేస్తామని అన్నారు.
TTD EO Anil Kumar Singhal Key Comments
దివ్యాంగులకు శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనానికి వెళ్లే ఏర్పాటు ఉందన్నారు. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్యూలైన్ల నిర్వహణ తప్పనిసరి చేశామన్నారు. లక్షలాది మంది భక్తులు దర్శనం టికెట్ల బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని తెలిపారు ఈవో. తిరుపతిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయని, అందుకే ఆన్ లైన్ లో కోటా పెంచడం వీలు పడదన్నారు.
భక్తుల సలహాలు, సూచనల మేరకు ఓటీపీ విధానం తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈవో. దర్శన క్యూలైన్ లో భక్తులతో మెలిగే విధానంపై శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ బుకింగ్ విధానం తీసుకు రావడం జరిగిందన్నారు. త్వరలోనే ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఆన్ లైన్, ఆఫ్ లైన్ దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ (TTD) బోర్డు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా భక్తులు నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రజా ప్రతినిధులకు టీటీడీ (TTD) ఈ సౌకర్యం కల్పించిందని, కొంతమంది దళారులు డబ్బు తీసుకొని భక్తులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. దళారులను నమ్మవద్దని కోరారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది స్వామి వారిని దర్శించు కోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య సౌకర్యాలు అందిస్తుందన్నారు. శ్రీవారి భక్తులకు నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్తుందని, హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయం పరిశీలిస్తామన్నారు. విఐపి లకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని చెప్పారు. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు.
Also Read : Minister Nara Lokesh Interesting Comments : అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువే



















