ICC Womens World Cup : ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముంబై వేదికగా నిర్వహించిన మహిళల వన్డే వరల్డ్ కప్ (ICC Womens World Cup) ఫైనల్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో డిజిటల్ వీక్షకుల సంఖ్యను పెంచింది . ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. 25 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళా జట్టు దక్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. దీంతో బీసీసీఐ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ. 51 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. మరో వైపు జట్టులోని క్రికెటర్లకు కాసుల పంట పండుతోంది. ఒక్కో రాష్ట్రం తమ తరపున ఆడినందుకు గాను భారీ నజరానాలు ప్రకటించాయి. ఇంకో వైపు ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం వజ్రాలు, ఆభరణాలు, స్థలాలు, నగదును ఇస్తున్నట్లు తెలిపారు.
ICC Womens World Cup Sensational
ఇదిలా ఉండగా విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ ను అత్యధికంగా వీక్షించినట్లు ఐసీసీ ఇవాళ ప్రకటించింది. గతంలో పోల్చిన దానికంటే ఇది ఎక్కువ అని తెలిపింది. డిజిటల్ మాధ్యమంలో 445 మిలియన్ల వీక్షకులను ఆకర్షించిందని తెలిపింది. మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఉమెన్ ఇన్ బ్లూ సాధించిన రికార్డ్ మామూలుది కాదని తెలిపింది. జియో స్టార్ స్పోర్ట్స్ సీఈఓ ఇషాన్ ఛటర్జీ ఈ విషయం వెల్లడించారు.
Also Read : Minister Nara Lokesh Interesting Comments : అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువే


















