K Kavitha : వికారాబాద్ జిల్లా : చేవెళ్లలో బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో చని పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha). అంతే కాకుండా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. పిల్లలను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిదని అన్నారు.
K Kavitha Strong Demand
చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాయి ప్రియ, నందిని, తనుష తల్లిదండ్రులు ఎల్లయ్య గౌడ్, అంబికలను పరామర్శించారు. వారిని కవిత ఓదార్చారు. బస్సు ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కవితను చూసి వారు కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు . NH-163 నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలిచి వేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఇకనుంచైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కల్వకుంట్ల కవిత సూచించారు. విచిత్రం ఏమిటంటే సురక్షితమైన రోడ్లు కావాలని కోరుతున్న స్థానికులపై కేసులు నమోదు చేయడం అన్యాయం అన్నారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని, రోడ్డును ఆలస్యం చేయకుండా మరమ్మతులు చేయాలని, కాంట్రాక్టర్‌ను జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Harish Rao Shocking Comments on CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్
















