Sri Charani : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలైన ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన క్రికెటర్ శ్రీచరణి (Sri Charani) శుక్రవారం భేటీ అయ్యారు. ఆమెతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మిథాలీ రాజ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. 143 కోట్ల భారతీయులు గర్వ పడేలా మీరంతా ఆడారని ప్రశంసలు కురిపించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో క్రికెట్ రంగం అభివృద్ది గురించి కూడా ప్రత్యేకంగా చర్చించారు.
Cricketer Sri Charani Meet CM Chandrababu
ఇదిలా ఉండగా శ్రీ చరణిని ప్రత్యేకంగా అభినందించారు. తమ సర్కార్ క్రికెట్ కోసం, క్రీడాకారుల కోసం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందజేస్తోందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. వరల్డ్ కప్ గెలవడం మామూలు విషయం కాదన్నారు. టోర్నీ పరంగా 10 వికెట్లు తీయడం, అంతే కాకుండా ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన భూమిక పోషించడం ఆనందంగా ఉందన్నారు సీఎం. త్వరలోనే పెద్ద ఎత్తున నజరానా ప్రకటిస్తామని వెల్లడించారు. మరో వైపు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు కూడా కార్యవర్గం పూర్తయిందని, భవిష్యత్తులో క్రీడా రంగానికి ఏపీని కేరాఫ్ గా మారుస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు.
Also Read : Minister Kandula Durgesh-Govt Strong Focus : పర్యాటక రంగం పురోభివృద్ధికి సర్కార్ ఫోకస్


















