అమరావతి : ఏపీ కూటమి సర్కార్ డేటా ఆధారిత పాలనతో మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన డేడా ఆధారిత పాలనపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు నారా లోకేష్, అనిత వంగలపూడితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలను ఆన్ లైన్ సేవలతో తప్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు సీఎం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్నామని, ఈ మేరకు వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రజలు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా మారుతున్న సాంకేతిక మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. ఈ మేరకు అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు నారా చంద్రబాబు. చాలా సమస్యలకు పరిష్కారం చూపేందుకు సాంకేతిక ఉపయోగ పడిందని చెప్పారు సీఎం. తాను టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్న సమయంలో తనను అంతా గేలి చేశారని కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం, పాలు పంచుకోవడం చేస్తున్నారని చెప్పారు. అందుకే మార్పును ఆహ్వానించాలని పిలుపునిచ్చారు సీఎం.
















