Ponnam Prabhakar : హైదరాబాద్ : రోజు రోజుకు తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar). ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. రవాణా శాఖ పనితీరు మెరుగు పర్చు కోవాలని అన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా ఆధ్వర్యంలో హోటల్ మెర్క్యూరీ లో ఆర్టీఏ మెంబర్స్ అథారిటీ కి రోడ్డు భద్రత పై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కింది స్థాయిలో రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకునేలా ఆర్టీఏ మెంబెర్స్ కి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
Minister Ponnam Prabhakar Key Instructions
వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేల చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల నుండి రాజధాని వరకు స్కూల్ , కాలేజి ,ఇతర విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. చనిపోయే కేసుల్లో రోడ్డు ప్రమాదాల వల్లే అధికంగా ఉన్నాయని , ఈ విషయం తన విచారణలో తేలిందన్నారు . ఆర్టీఏ మెంబెర్స్ కి యూనిసెఫ్ శిక్షణ కార్యక్రమంలో దిశా నిర్దేశం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాదాల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవేర్నెస్ కల్పించాలని స్పష్టం చేశారు.
Also Read : Minister Nara Lokesh Important Comments : అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం
















