Pushpa 2 : పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప సీక్వెల్ చిత్రం పుష్ప-2 మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. దీనికి డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే కాసుల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, పాటలు దుమ్ము రేపాయి.
Pushpa 2 Collections…
ప్రధానంగా స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన మేకింగ్, గుండెలను నేరుగా తాకే డైలాగులు పుష్ప-2(Pushpa 2) ను విజయ తీరాలకు చేర్చాయి.
ఈ చిత్రం విడుదలై నేటితో 46వ రోజుకు చేరుకుంది. నెలకు పైగా వసూళ్లలో రికార్డుల మోత మోగిస్తోంది .
ఓ వైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. అయినా ఏ మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ తగ్గలేదు.
బాక్సులన్నీ పూర్తిగా కాసులతో నిండి పోయాయి. పుష్ప 2 ఆదివారం నాడు రూ. 1.18 కోట్లు ఆర్జించింది, మొదటి రోజు రూ. 164.25 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాగా ఈ సినిమా భారతదేశంలో రూ. 1,227.93 కోట్ల నికర వసూళ్లు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,732.95 కోట్లు వసూలు చేసింది. విశేషమేమిటంటే, విడుదలైన 32 రోజుల్లోనే రూ. 1,830 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమా ప్రకటించబడింది.
Also Read : Hero Akshay-Kannappa : కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్