KTR : హైదరాబాద్ : ఆరు నూరైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనేనని ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో రోడ్ షో చేపట్టారు. ఆశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా అని తేలి పోయిందన్నారు. మెజార్టీ ఎంత వస్తుందనే దానిపైనే తాము వేచి చూస్తున్నామని చెప్పారు.జూబ్లీహిల్స్‌లో మరోసారి గత ఎన్నికల రిజల్టే రాబోతోందని జోష్యం చెప్పారు. అందరికి అన్నం పెట్టే నగరం హైదరాబాద్ అని అన్నారు. కులం, మతం, ప్రాంతం ఎవరినైనా కడుపులో పెట్టుకొని చూసుకునే గొప్ప సంస్కృతి ఇక్కడ ఉందన్నారు కేటీఆర్. గతంలో ప్రతి ఇంట్లో, షాపులో ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితి ఉండేదన్నారు. సమ్మర్ వచ్చిందంటే తాగునీటికి కటకట ఉండేదని పేర్కొన్నారు.
KTR Key Comments
కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకొని బాగు చేశారని చెప్పారు కేటీఆర్.
24 గంటల పాటు కరెంట్ ఇచ్చారని, దీంతో ఇన్వర్టర్‌లు, జనరేటర్‌లు మాయమయ్యాయని అన్నారు. పరిశ్రమలకు ఆటంకం లేకుండా చేశామన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ వంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చామన్నారు. ఈ ఘనత ఒక్క బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. 3 లక్షల ఐటీ ఉద్యోగులను 10 లక్షలకు తీసుకెళ్లామన్నారు. రియల్ ఎస్టేట్ పెరిగిందని, వాటితో పాటు ఇతర వ్యాపారాలు కూడా పెరిగాయన్నారు కేటీఆర్. ఓలా, ఉబర్, జొమాటో, గిగ్ వర్కర్లు ఎలా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
Also Read : K Kavitha Clear Update : సామాజిక తెలంగాణ సాధించే దాకా పోరాటం


















