INDW vs SAW : ముంబై : భారత దేశ క్రికెట్ చరిత్రలో అరుదైన సన్నివేశానికి వేదికైంది ముంబై. బీవై పాటిల్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరితమైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ (INDW vs SAW) లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును భారత మహిళా జట్టు ఓడించింది. 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. చివరి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్ . అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అమ్మాయిలు రాణించారు. సెమీ ఫైనల్ లో 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను ఇంటికి పంపించిన భారత్ అదే దూకుడును ఫైనల్ లో ప్రదర్శించింది. ఆసిస్ తో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడితే జెమీమా రోడ్రిగ్స్ సూపర్ షో చేసింది. అజేయంగా 134 బంతులు ఎదుర్కొని 127 రన్స్ చేసింది. ఫైనల్ కు చేర్చడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు.
INDW vs SAW Sensational
ఇక కీలకమైన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా కెప్టెన్ సాగించిన ఒంటరి పోరాటం ఫలించ లేదు. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. షెపాఫీ వర్మ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ చేసింది. బ్యాటింగ్ తో అదరగొట్టింది. ఇక బౌలింగ్ పరంగా 2 కీలకమైన వికెట్లు తీసింది. దీప్తి శర్మ ఒక్కత్తే 5 వికెట్లు తీసి సఫారీ జట్టు పతనాన్ని శాసించింది. ఈ టోర్నీలో 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా నిలిచింది. ఇక దుమ్ము రేపిన షెఫాలీ వర్మ కు ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. తొలిసారి టీమిండియా వరల్డ్ కప్ ను ముద్దాడింది.
Also Read : KTR Shocking Comments on Hydraa : హైడ్రా పేరుతో అరాచకం కేటీఆర్ ఆగ్రహం


















