RBI : రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు ఇకపై సిబిల్ స్కోర్ సమాచారం వేగంగా లభించనుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆటో రుణాలు తీసుకునే వారికి ఇది ఒక మంచి వార్తగా చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) (RBI) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, క్రెడిట్ స్కోర్ సమాచారాన్ని కంపెనీలు ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కాకుండా రియల్ టైమ్‌లో అందించాల్సి ఉంటుంది.
RBI Interesting Decision
ఇప్పటివరకు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ సమాచారం సంస్థలు (CICs) ప్రతి పక్షం రోజులకు ఒకసారి మాత్రమే డేటాను అప్‌డేట్ చేస్తుండేవి. అయితే, రుణ దరఖాస్తుదారులకు ఈ ఆలస్యం ఇబ్బందిగా మారుతుండటంతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు.
ఈ నిర్ణయం వల్ల రుణదారులు వారి సిబిల్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉండటంతో, రుణమంజూరులో పారదర్శకత పెరుగుతుంది. బ్యాంకులు, NBFCలు కూడా నూతన డేటాతో నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.
రుణం కోసం ప్రయత్నిస్తున్న వారు తమ క్రెడిట్ హిస్టరీపై వెంటనే సమాచారాన్ని పొందగలగడం వల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. అలాగే, రుణమంజూరు ప్రక్రియ వేగవంతమవుతుంది.
ఈ చర్యతో వ్యవస్థలో నమ్మకం, సామర్థ్యం, పారదర్శకత మరింత మెరుగుపడతాయని ఆర్‌బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.
Also Read : Make in India-China Shocking : ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై భారత్ పై ఆంక్షలు విధించిన చైనా



















