Kandula Durgesh : అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాను తీవ్రతను తగ్గించడంలో , అధికారులను , కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలలో పాల్గొనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తనను ప్రత్యేకంగా అభినందించడం, ఆపై అవార్డుతో పాటు సర్టిఫికెట్ ను అందించడం సంతోషం కలిగించిందన్నారు. ఇది మరింత తనపై బాధ్యతను పెంచేలా చేసిందని చెప్పారు. శనివారం మొంథా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా సేవలందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా “సైక్లోన్ మొంథా ఫైటర్” గౌరవం అందుకున్నారు మంత్రి కందుల దుర్గేష్.
Minister Kandula Durgesh Praises
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది దక్కడం తనకు గర్వ కారణంగా ఉందన్నారు. ఈ గుర్తింపు నా వ్యక్తిగతమైనది కాదన్నారు. ఇది మన సమిష్టి కృషికి లభించిన ప్రశంస అని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించిన అధికారులు, సిబ్బంది, సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. మొంథా తుఫాన్ సమయంలో చూపిన అంకితభావం, సమర్థ నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిన అభినందన, నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ అంకితభావంతో కొనసాగుతానని ఈ సందర్బంగా ప్రకటించారు కందుల దుర్గేష్.
Also Read : CM Chandrababu Important Comments : వచ్చే విపత్తుల్ని ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం

















