KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున జనం హాజరయ్యారు. మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కానీ మెజారిటీ ఎంతో తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఎందరో బలిదానం చేసుకుంటే , ఉద్యమాలు, పోరాటాలు ఏస్తే వచ్చిందని, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు కేటీఆర్. రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏమాత్రం బాగా లేకుండేదన్నారు. నాడు కరెంటు లేదని, హైదరాబాద్‌లో ఇన్వర్టర్ లేని ఇల్లు లేదన్నారు. కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా నిలబడేవారే నిజమైన నాయకుడని అన్నారు.
KTR Key Comments on Jubilee Hills By Election
రాష్ట్రం ఏర్పడిన రోజు మన తలసరి ఆదాయం రూ. లక్ష మాత్రమేనని గుర్తు చేశారు. కానీ అనతి కాలంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారు కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో కరెంటు, నీళ్ల సమస్య పరిష్కారం అయ్యిందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టామని చెప్పారు. హైదరాబాదే కాదు అటు పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత మనదేనని స్పష్టం చేశారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి పేదలకు చదువు అందించడం జరిగిందన్నారు. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి కోసం పథకాలు ఇచ్చామన్నారు.
Also Read : Hydraa Clear Update : పూడిక తీత ఆపొద్దు నాలాల్లో నీరు నిలవొద్దు


















