Mohammed Shami : కోల్ కతా – భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. ఈ సందర్బంగా తన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. షమీ లాంటి సీనియర్ క్రికెటర్ కు ఈ భరణం ఇవ్వడం చాలా తక్కువ అని ఆరోపించారు. మేం నెలకు రూ. 10 లక్షలు భరణం కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా భార్యకు నెలకు రూ. 1. 5 లక్షలు, కూతురు కోసం నెలకు రూ. 2.5 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
Mohammed Shami Case Updates
ఇదిలా ఉండగా మహమ్మద్ షమీ (Mohammed Shami) , హసీన్ జహాన్ 2018లో విడాకులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సంచలన ఆరోపణలు చేసింది. తమను పట్టించు కోవడం లేదని, క్రికెట్ స్టార్ ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని తనను, కూతురును ఇబ్బందులకు గురి చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇదే విషయాలను కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది కూడా.
ఈ మొత్తం వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్నారు న్యాయమూర్తి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ సంయమనం పాటించాలని సూచించారు. కాగా తమకు రూ. 10 లక్షలు నెలకు కావాలని కోరడం తప్పా అని వాపోయింది షమీ భార్య జహాన్. మహమ్మద్ షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నాడో.. నేను, నా కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంపై విన్న ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రూ. 4 లక్షలు భరణంగా ఇవ్వాలని చివరి తీర్పు వెలువరించింది.
Also Read : PM Modi Special Award : మోదీకి ఘనా దేశ అత్యున్నత పురస్కారం


















