Telangana Govt : హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్స్ లక్షలాది మంది పని చేస్తున్నారు. ఇందు కోసం వారికి సామాజిక భద్రతతో పాటు మెరుగైన వేతనాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైదరాబాద్ కు చెందిన షేక్ సలావుద్దీన్ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం కూడా ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గిగ్ వర్కర్స్ కూడా సమాజంలో భాగమేనని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Govt) గిగ్ వర్కర్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. గిగ్ వర్క్‌లో పారదర్శకతను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఆలస్యమైన చెల్లింపులు, సస్పెన్షన్లు లేదా మోసపూరిత పద్ధతులకు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బిల్లు ప్రతిపాదిస్తుంది.
Telangana Govt Key Update
100 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా అంతర్గత వివాద కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబెర్, ఓలా వంటి ప్లాట్‌ఫారమ్‌లు తమ మొత్తం చెల్లింపులలో 1–2 శాతాన్ని సంక్షేమ నిధికి విరాళంగా కేటాయించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూర్చేలా చూడాలని పేర్కొంది. పారదర్శకతను చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన మొదటి భారతీయ రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా అవతరించే అవకాశం ఉంది. నవంబర్ 7న జరిగే రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) చట్టం, 2025 ముసాయిదాను ఆమోదించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read : Hydraa Sensational : రూ. 39 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
















