YS Sharmila : విజయవాడ : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ బడుల్లో బిడ్డల వరస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇది మన్యంలో జరుగుతున్న మరణ మృదంగమే తప్పా మరోటి కాదన్నారు. కురుపాం ఘటన తర్వాతైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడక పోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ముక్కు పచ్చలారని బిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల విద్యార్థిని మృతి కూటమి ప్రభుత్వం చేసిన వరుస హత్యనే అని సంచలన ఆరోపణలు చేశారు షర్మిలా రెడ్డి (YS Sharmila). బిడ్డ బంగారు భవిష్యత్ ను చిదిమేశారంటూ వాపోయారు . గురుకులాల్లో పిల్లల జీవితాలను గాల్లో దీపాలుగా మార్చారని మండిపడ్డారు.
YS Sharmila Slams AP Govt
ఏజెన్సీ ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకొనే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రచారం తప్పా సోయి లేకుండా పోయిందన్నారు షర్మిలా రెడ్డి. చంద్రబాబు కూటమి 16 నెలల పాలనలో 21 మంది బిడ్డలు చని పోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. వారి మృతదేహాలపై పాలన సాగుతున్నట్లు లెక్క అని అన్నారు షర్మిలా రెడ్డి. వరుస మరణాలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. గిరిజన సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. వసతి గృహాల్లో గిరిశిఖర బిడ్డలకు ఏది పెట్టినా అడగరని ప్రభుత్వానికి అలుసు అని ఫైర్ అయ్యారు. ఒక్క రూంలో 100 మందిని కుక్కినా నోరు మెదపరని ధీమా తప్పా మరోటి కాదన్నారు.
Also Read : Bhumi Sunil Gets Bhumi Ratna Award Interesting : భూమి సునీల్‌కు భూమి రత్న పురస్కారం

















