Cell Phones : కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు దగ్ధం ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది సురక్షితంగా బయట పడ్డారు. ఇదిలా ఉండగా ఈ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు (Cell Phones) పూర్తిగా పనికి రాకుండా పోయాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46 లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఫోన్లు దగ్ధం కావడంతో బావురుమన్నాడు. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో (Cell Phones) బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం విశేషం.
Cell Phones Burnt Sensational
ఇదిలా ఉండగా కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ వివరాలు వెల్లడించారు. బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని ఆయన చెప్పారు. మొబైల్ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలి పోయాయని తెలిపారు. మంటల తీవ్రత వల్ల బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగి పోయాయని చెప్పారు.
కరిగిపోయిన షీట్ల కింద నుంచి ఎముకలు, బూడిద కింద పడటం చూశామని వెంకటరమణ తెలిపారు. ఇంధన లీకేజీ కారణంగా ముందు భాగంలో మంటలు అంటుకున్నాయని ఆయన వివరించారు. ఎదురుగా వచ్చిన బైక్ బస్సు కింద ఇరుక్కు పోవడంతో దాని నుంచి చిందిన పెట్రోలు తాకిడికి వేడితో లేదా స్పార్క్‌తో మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని తెలిపారు. బస్సు తయారీలో ఇనుము బదులు తేలికపాటి అల్యూమినియం వాడటం వలన వాహనం బరువు తగ్గి వేగం పెరుగుతుందని, అయితే అగ్నిప్రమాద సమయంలో ఆ లోపం ప్రమాదాన్ని మరింత పెంచిదన్నారు.
Also Read : CM Revanth Reddy Delhi Shocking Visit : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

















