KCR : హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ చీఫ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR). ఎర్రవెల్లిలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో అధినేత ప్రసంగించారు. ఈ మేరకు ప్రచారం ఎలా చేపట్టాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించాలని సూచించారు. భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని వాపోయారు.
KCR Key Comments on Jubilee Hills By Election
విజ్ఞులైన జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఈ సమావేశంలో ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్నారు.
Also Read : Kurnool Bus Accident Sensational : ఘోర ప్రమాదం వోల్వో బస్సు దగ్ధం
















