Jubilee Hills : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు తుది గడువు ముగిసే నాటికి మొత్తం 211 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపింది. ఇందులో 130 నామినేషన్లను వివిధ కారణాల రీత్యా తిరస్కరించినట్లు తెలిపారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ , హెచ్ ఎండీఏ కమిషనర్ కర్ణన్. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణపై పరిశీలకులుగా ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులను నియమించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు ఎన్నికల అధికారి. ఇక దాఖలు చేసిన నామినేషన్లను 81 మంది నామినేషన్లను ఆమోదించడం జరిగిందన్నారు. కాగా 321 నామినేషన్లు వేశారని తెలిపారు.
Jubilee Hills Elections
ఈ నామినేషన్లలో ఓఆర్ఆర్ బాధిత రైతులు కూడా ఉండడం విశేషం. భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ , భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకాల దిలీప్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా పోటీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ఉంటోంది. ఇటీవలే జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ మేరకు వచ్చే నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా అభ్యర్థిత్వాల ఉప సంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 అంటే శుక్రవారం. గడువు తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.
Also Read : Hydraa Sensational : జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని కాపాడిన హైడ్రా


















