YVS Chowdary : నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన వీణారావు కథానాయికగా నటిస్తున్నారు. ఆమెను పరిచయం చేసేందుకు వై.వి.ఎస్.చౌదరి(YVS Chowdary) మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వీణారావు కూచిపూడి డ్యాన్సర్ అని.. అచ్చతెలుగమ్మాయి అని ఆయన చెప్పారు. “సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా 1979 నవంబర్ 30న రిలీజైంది. అందుకే ఇదే రోజున వీణారావును పరిచయం చేయాలనుకున్నట్లు వైవీఎస్ చౌదరి తెలిపారు.
YVS Chowdary….
సుప్రియ, స్వప్నదత్లు వీణారావును మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ మాట్లాడుతూ.. ‘వైవీఎస్ చౌదరి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుంటారు. తన కెరీర్లో ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీ పరిచయం చేశారు. వీణారావు ఎంతో అదృష్టవంతురాలు. ఆమె ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. తెలుగు అమ్మాయిలు ఇండస్ర్టీలోకి రావాల్సిన సమయమిదని నిర్మాత స్వప్నదత్ అన్నారు. విజయవాడ అమ్మాయి హీరోయిన్గా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు.
Also Read : Teja Sajja : హనుమాన్ హీరో తేజ సజ్జ పై ప్రశంసల వర్షం కురిపించిన రణవీర్ సింగ్