Passport Seva : భారతదేశ పౌరులకు పాస్‌పోర్ట్ పొందడాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పాస్‌పోర్ట్ సేవా 2.0 (Passport Seva) ను ప్రారంభించింది. జూన్ 24న పాస్‌పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. దీనితోపాటు ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
Passport Seva – కొత్త పాస్‌పోర్ట్ సేవా విధానం లక్ష్యాలు:
ప్రజలకు వేగవంతమైన సేవలందింపు
విదేశీ ప్రయాణాల ప్రక్రియను సరళీకరించడం
పోలీస్ ధ్రువీకరణ సమయాన్ని 5-7 రోజులకు తగ్గించడం
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం
ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకతలు :
కాంటాక్ట్‌లెస్ చిప్ టెక్నాలజీ ఆధారంగా ఈ పాస్‌పోర్ట్‌లు తయారవుతాయి
ఇందులో సురక్షితంగా వ్యక్తిగత సమాచారం నమోదవుతుంది (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ముఖ ఛాయాచిత్రం)
అంతర్జాతీయ ప్రమాణాలు పాటించబడ్డాయి – ICAO మార్గదర్శకాలకు అనుగుణంగా రూపకల్పన
డేటా ఫోర్జరీ, డూప్లికేషన్ ప్రమాదాలు లేకుండా అత్యాధునిక సాంకేతికతతో తయారు
విమానాశ్రయాల్లో తనిఖీలు వేగంగా పూర్తవుతాయి
దరఖాస్తు ప్రక్రియ ఇలా :
భారత ప్రభుత్వ అధికారిక పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ (https://passportindia.gov.in) ను సందర్శించాలి
కొత్తదారులైతే ఖాతా సృష్టించాలి. ఇప్పటికే ఉన్నవారు లాగిన్ కావచ్చు
‘e-Passport’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ఎంపిక చేసుకోవాలి
రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి
బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాలి
అన్ని పత్రాలతో కూడిన ఫైలుతో షెడ్యూల్ ప్రకారం PSK లేదా POPSK వద్ద హాజరుకావాలి
తుదిగా…
ఈ కొత్త విధానం వల్ల పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియలో వేగం పెరుగుతుంది. అలాగే భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణించేందుకు మరింత సులభతరం అవుతుంది. ఈ-పాస్‌పోర్ట్‌లు భవిష్యత్ ప్రయాణాలకు కీలక పరిష్కారంగా నిలవనున్నాయి.
Also Read : Today Gold and Silver Price : పసిడి ప్రియులకు ఇదో షాకింగ్ న్యూస్



















