Gold : హైదరాబాద్ : రోజు రోజుకు బంగారం ధర ఆగనంటోంది. పసిడి కోలుకోలేని షాక్ ఇస్తోంది. సామాన్యులు, పేదలు కొనుగోలు చేసేందుకు లేకుండా పోతోంది. ఏకంగా అందనంత దూరంలో ధర వెక్కిరిస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం (Gold) ధరలు మండుతున్నాయి. మంటలు రేపుతున్నాయి. కోలుకోలేని షాక్ కు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850 ఉంటే, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,19,940 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,89,900 లుగా ఉంది.
Gold Price Updates
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,30,850, 22 క్యారెట్ల ధర రూ.1,19,940 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,89,900లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,31,000, 22 క్యారెట్లు రూ.1,20,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900లుగా ఉంది. ఇక ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,850, 22 క్యారెట్లు రూ.1,19,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,71,900లుగా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,30,900 ఉండగా , 22 క్యారెట్ల ధర రూ.1,19,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,89,900లుగా ఉంది.
కాగా బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.
Also Read : Danam Nagender Important Star Campaign : దానం నాగేందర్ ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్



















