BC JAC Bandh : హైదరాబాద్ : బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయ్యింది. అన్ని కులాలకు చెందిన బీసీ సమాజం అంతా ఒక్కటై నినదించారు. రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఇది కొనసాగుతుందని అన్నారు. తెల్లవారుజాము నుండే బస్ డిపోల వద్ద బైఠాయించారు బీసీ శ్రేణులు (BC JAC Bandh). ఏ ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. సాయంత్రం వరకు అన్ని దుకాణాలను స్వచ్చంధంగా మూసి వేశారు. బీసీల సత్తా ఏమిటో చూపించారు. హైదరాబాదులో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద బీసీల ధూమ్ దాం ఆకట్టుకుంది. బిసి జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్ వద్ద 12 గంటలు పాటు బైఠాయించారు. బీసీల ఆందోళనకు మద్దతుగా హాజరయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ, సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, తదితరులు. మరో వైపు ఉస్మానియా యూనివర్శిటీలో స్టూడెంట్స్ కదం తొక్కారు . భారీ ర్యాలీ చేపట్టారు.
BC JAC Bandh Sensational in Telangana
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత వచ్చేంత వరకు బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.రాష్ట్ర బంద్ ఒక శాంపిల్ మాత్రమేనని, ముందు ముందు బీసీల తడాఖా ఏందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బంద్ ను విజయవంతం చేసి బీసీల ఐక్యత చాటి చెప్పామన్నారు. మొదటిసారి తెలంగాణలో చారిత్రాత్మకంగా బంద్ జరిగిందన్నారు. బీసీ బంద్ తోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బిజెపి తెలంగాణ నేతలు ప్రధాని వద్దకు తీసుకెళ్తామంటే సీఎం అఖిలపక్షంతో రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయించాలన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణ బిజెపి పెద్దలు బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రధానిని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు మందకృష్ణ మాదిగ.
Also Read : Rajnath Singh Shocking Update : బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ ను లేకుండా చేస్తాయి

















