Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, మోసం చేయడం తప్పా ఏ ఒక్క మంచి పని లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వాపోయారు. హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోందన్నారు. కొన్ని శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించారని, చాలా మంది కాంట్రాక్టు సిబ్బందికి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని ఆరోపించారు. వారంతా చాలీ చాలని జీతాలతో నెట్టుకు రావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు హరీశ్ రావు. మూడు నెలలు నెగిటివ్ ద్రవ్యోల్బణం పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
MLA Harish Rao Slams Congress Govt
అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో రేవంత్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తున్నదంటూ మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయనించడం ప్రమాదకరమన్నారు. ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదన్నారు. జూన్ లో -0.93%, జూలైలో -0.44%, సెప్టెంబర్ లో -0.15% లలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం దారుణమన్నారు.
Also Read : Telangana EC Shocking : జూబ్లీ హిల్స్ బై పోల్ పై ఎగ్జిట్ పోల్స్ నిషేధం
















