Mahesh Kumar : హైదరాబాద్ : యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar). ఆదివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి దూరదృష్టి నాయకత్వంలో, చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చిందని అన్నారు. ఆదివారం నాటితో సరిగ్గా సహ చట్టానికి 20 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. దేశ చరిత్రలో RTI చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం ఆర్టీఐ ద్వారా కల్పించారని పేర్కొన్నారు. ప్రజలకు ఈ చట్టం జీవన రేఖ గా మారిందన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు ఇది వజ్రాయుధంగా పని చేసేలా ఆస్కారం ఏర్పడిందన్నారు.
TPCC Chief Mahesh Kumar Goud Key Comments
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా బీసీ, ఎస్టీ, ఎస్సీ (మాల)లకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. RTI తో సరుకుల పంపిణీ, పెన్షన్‌లు, బకాయిలు, స్కాలర్‌షిప్‌లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందన్నారు . సరుకుల పంపిణీ, పెన్షన్‌లు, బకాయిలు, స్కాలర్‌షిప్‌లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు టీపీసీసీ చీఫ్. ఉపాధి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని MGNREGA (2005) తీసుకొచ్చిందన్నారు. ఆర్టీఐ, ఉపాధి హామీ పథకం రెండూ చారిత్రాత్మక చట్టాలని పేర్కొన్నారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం

















