NHRC : ఢిల్లీ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) (NHRC) సీరియస్ అయ్యింది. ఈ మేరకు గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా గత నెల సెప్టెంర్ లో యూరియా కోసం ధర్నాలో పాల్గొన్నాడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడు. ఈ సందర్బంగా తనను వాడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి , కానిస్టేబుల్స్ అతడిని చట్ట వ్యతిరేకంగా ఇంట్లో నుంచి లాకెళ్లి కులం పేరిట దూషించారు. అంతే కాకుండా ఇష్టానుసారంగా కొట్టి అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్తే మళ్లీ కొడతామని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి , కానిస్టేబుల్ బెదిరించారని, అదేవిధంగా బాధితుడి భార్య దీనా ను కూడా దుర్భాషలాడారంటూ న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
NHRC Shocking Comments
ఈ ఫిర్యాదు పై శనివారం విచారణ చేపట్టింది ఢిల్లీలోని జాతయ మానవ హక్కుల సంఘం. ఇందుకు సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుళ్లపై మండిపడింది . రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ సంఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది. సంఘటనకు కారణమైన ఎస్ఐ , కానిస్టేబుల్ లను విధుల నుండి తొలగించి SC/ST atrocities చట్టం కింద కేసులు నమోదు చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా బాధితుడికి సరైన వైద్య సదుపాయం అందించి నష్ట పరిహారం కూడా చెల్లించి పూర్తి నివేదిక 4 వారాల్లోపు కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించింది.
Also Read : Nobel Prize – Maria Corina Machado : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

















