Manda Krishna Madiga : హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు పీడిత వర్గాలపై దాడులు అధికం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అఖిల పక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై బూటు విసరడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఘటనతో సభ్య సమాజం తల దించుకునేలా చేసిందన్నారు. రోజు రోజుకు దాడుల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు . ప్రతి ఒక్కరు ఈ ఘటనను ఖండించాలని అన్నారు మందకృష్ణ మాదిగ. ఈ దాడిని ఖండిస్తూ దేశ ప్రధాని స్పందించిన తీరును స్వాగతిస్తున్నమని చెప్పారు.
Manda Krishna Madiga Comments
మోడీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని అన్నారు మందకృష్ణ మాదిగ. ఆయన స్పందననే దేశ ప్రజల స్పందన అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించ కూడదన్నారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏదో ఒక రోజు తల దించుకునే పరిస్థితులు రాబోతాయని , అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో తనపట్ల జరిగిన దాడి గురించి సీజేఐ స్పందించిన తీరు అత్యంత గౌరవ ప్రదంగా, హుందాగా ఉందని కితాబు ఇచ్చారు. ఇలాంటి వాళ్లే ఈ దేశానికి అవసరం అన్నారు.
Also Read : CM Chandrababu Interesting Comments : ఇథనాల్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు : సీఎం
















